Upper castes: ఎస్సీ, ఎస్టీల కంటే ఓసీల ఆయుర్దాయమే ఎక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి

  • 4-6 ఏళ్లు అధికం
  • పురుషుల మధ్య ఈ అంతరం ఎక్కువ
  • జీవన ప్రమాణాలు, ఆయుర్దాయంలోనూ పెరుగుదల
Upper castes live 4 to 6 years more than SCs STs  New study

భారతీయుల ఆయుర్దాయం అందరికీ ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుందని అనుకుంటున్నారా..? అయితే తాజా అధ్యయన ఫలితాలు తెలుసుకోవాల్సిందే. జీవిత కాలం అన్నది ఆయా సామాజిక వర్గాలను బట్టి వేర్వేరుగా ఉంటోందని పరిశోధకులు తెలుసుకున్నారు. 

అగ్ర కులాలుగా పరిగణిస్తున్న వారిలోని పురుషుల ఆయుర్దాయం .. ఎస్సీ, ఎస్టీల పురుషులతో పోలిస్తే 4-6 ఏళ్లు ఎక్కువగా ఉంటోంది. భిన్న ప్రాంతాల్లో, భిన్న ఆదాయ స్థాయుల్లో ఇది కనిపించింది. అయితే మొత్తం మీద అన్ని సామాజిక వర్గాల్లో జీవన ప్రమాణ కాలం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది.

ఉన్నత వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని పురుషుల మధ్య ఆయుర్దాయ అంతరం 4.6 నుంచి 6.12 సంవత్సరాలకు పెరిగింది. ఉన్నత వర్గాల పురుషులు, ముస్లిం మతంలోని పురుషుల మధ్య ఆయుర్దాయ వ్యత్యాసం 0.3 నుంచి 2.6 ఏళ్లకు పెరిగిపోయింది. ఇక ఉన్నత వర్గాలు, ముస్లిం మహిళల మధ్య ఈ అంతరం 2.1 ఏళ్ల నుంచి 2.8 ఏళ్లకు పెరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రెండు, నాలుగో రౌండు సర్వే అధ్యయన వివరాలను (1997-2000, 2013-16) ఈ అధ్యయనానికి ప్రామాణికంగా తీసుకున్నారు. 

 రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో అన్ని సామాజిక వర్గాల వారిలో ఆయుర్దాయం తక్కువగా ఉందని గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలు పాపులేషన్ అండ్ డెవలప్ మెంట్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

More Telugu News