Tirumala: తిరుమలలో ఎల్ఈడీ స్క్రీన్లపై తెలుగు సినిమా పాటల ప్రసారం.. విస్మయానికి గురైన భక్తులు

Film songs telecast in led screen at Tirumala
  • తిరుమలలో మరో తప్పిదం
  • వ్యాపార సముదాయం వద్ద ఎల్ఈడీ తెరపై సినీ గీతాలు
  • అరగంట పాటు ప్రసారమైన వైనం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి తప్పిదం చోటుచేసుకుంది. తిరుమలలోని ఓ వ్యాపార సముదాయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. నిత్యం గోవింద నామస్మరణ, అన్నమయ్య తదితరుల భక్తిగీతాలతో మార్మోగే తిరుమల కొండపై సినిమా పాటలు ప్రసారం కావడంతో భక్తులు విస్తుపోయారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. సినిమా పాటల దృశ్యాల వెనుక గోవింద నామాలు ప్రసారం కావడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు.
Tirumala
LED Screen
Film Songs
TTD

More Telugu News