Andhra Pradesh: హైద‌రాబాద్‌లో గోదావ‌రి బోర్డు స‌మావేశం... గైర్హాజ‌రైన ఏపీ అధికారులు

  • జ‌ల‌సౌధ‌లో స‌మావేశం ప్రారంభం
  • హాజ‌రైన తెలంగాణ అధికారుల బృందం
  • ఏపీ ప్ర‌తినిధుల కోసం వేచిచూసిన వైనం  
  • స‌మావేశాన్ని వాయిదా వేసిన బోర్డు
grmd meeting postponed

గోదావ‌రి న‌దీ జ‌లాలపై నెల‌కొన్న వివాదాల ప‌రిష్కారం కోసం భేటీ అయిన గోదావ‌రి న‌దీ జ‌లాల యాజమాన్య సంస్థ (జీఆర్ఎంబీ) స‌మావేశం మ‌రోమారు వాయిదా పడింది. హైద‌రాబాద్‌లోని జ‌ల‌సౌధ‌లో శుక్ర‌వారం మొదలైన ఈ స‌మావేశానికి తెలంగాణ ప్ర‌తినిధి బృందం హాజ‌రైనా... ఏపీ నుంచి ప్ర‌తినిధులెవ్వ‌రూ హాజ‌రు కాలేదు. దీంతో ఏపీ ప్ర‌తినిధుల కోసం కాసేపు వేచి చూసిన బోర్డు...వారి జాడ లేక‌పోవ‌డంతో స‌మావేశాన్ని వాయిదా వేసింది.

ఈ స‌మావేశంలో గోదావ‌రి న‌దీ జ‌లాల పంపిణీ, గోదావ‌రిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, వాటి ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను బోర్డుకు అప్ప‌గించడం వంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంది. ఈ స‌మావేశానికి సంబంధించి ఏపీ ప్ర‌భుత్వానికి బోర్డునుంచి ముందుగానే స‌మాచారం వెళ్లింది. అయితే ఈ స‌మావేశానికి తాను గైర్హాజ‌ర‌వుతున్న‌ట్లు ఏపీ ప్రభుత్వం బోర్డుకు స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News