Jagan: విదేశీ పర్యటనకు వెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్

CM YS Jagan to tour Davos for World Economic forum summit 2022
  • వచ్చే నెల దావోస్ కు వెళ్లనున్న జగన్
  • వారం రోజుల పాటు అక్కడే గడపనున్న సీఎం
  • వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెలలో ఆయన దావోస్ కు వెళ్లబోతున్నారు. మే 22న దావోస్ కు వెళ్లే సీఎం అక్కడ వారం రోజుల పాటు ఉంటారు. అక్కడ జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో కూడా ఆయన పాల్గొంటారు. ఆయనకు ఇంతకు ముందే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబర్ లోనే జరగాల్సి ఉంది. అయితే, కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసరడంతో సమ్మిట్ నిర్వహణ వాయిదా పడింది. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్ గానే జరుగుతున్నాయి. ఇప్పుడు నేరుగా జరగబోతున్నాయి.
Jagan
YSRCP
Foreign Trip
Davos

More Telugu News