Guntur: గుంటూరు జీజీహెచ్‌లో రాలి ప‌డిన పైక‌ప్పు.. త‌ప్పిన పెను ముప్పు

  • గ‌ర్భిణీల వార్డులో ఊడిప‌డ్డ పైక‌ప్పు పెచ్చులు
  • ప్ర‌మాదం స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో త‌ప్పిన ముప్పు
  • మంత్రి త‌నిఖీ చేసిన మ‌రునాడే ఘ‌ట‌న‌
roof top fell down in guntur ggh

గుంటూరులోని ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రి (జీజీహెచ్‌)లో గురువారం నాడు పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. ఆసుప‌త్రిలోని గ‌ర్భిణీల వార్డుకు చెందిన కారిడార్‌లో పైక‌ప్పు పెచ్చులు రాలి ప‌డిపోయాయి. ఆ స‌మ‌యంలో కారిడార్‌లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన మ‌రునాడే ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News