Karnataka: 'కేజీఎఫ్ 2' ప్రదర్శిస్తున్న థియేటర్లో తుపాకి కాల్పులు!

  • థియేటర్ లో మూడు రౌండ్లు కాల్చిన ఆగంతుకుడు
  • ఒక వ్యక్తి కాల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్
  • కర్ణాటకలోని శిగ్గావిలో చోటుచేసుకున్న ఘటన
Gun fire in KGF2 theatre

కర్ణాటక స్టార్ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. విదుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక యష్ అభిమానులు థియేటర్లలో చేస్తున్న సందడి ఓ రేంజ్ లో ఉంటోంది. ఈలలు వేస్తూ, గోల చేస్తూ హంగామా చేస్తున్నారు. మరోవైపు ఓ అభిమాని ఏకంగా తుపాకీతో హల్ చల్ చేశాడు. యష్ డైలాగ్స్ ని అనుకరిస్తూ తుపాకీని గాల్లోకి లేపి ఫైర్ చేశాడు. 

ఊహించని ఈ ఘటనతో థియేటర్ లోని ప్రేక్షకులు బెంబేలెత్తిపోయారు. శిగ్గావిలోని రాజశ్రీ థియేటర్ లో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగంతుకుడు మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో వసంత్ కుమార్ అనే ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఆయన కాల్లోకి బుల్లెట్ దిగింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే చీకట్లో ఆంగతుకుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News