Russia: మీకూ ఉక్రెయిన్ గతే పడుతుంది: స్వీడన్, ఫిన్లాండ్ లకు రష్యా హెచ్చరిక

  • నాటోలో చేరే ఆలోచనను విరమించుకోవాలన్న రష్యా
  • రెండు దేశాలను హెచ్చరించామన్న రష్యా విదేశాంగ శాఖ
  • ఆ రెండు దేశాలకు రష్యా గురించి బాగా తెలుసని వ్యాఖ్య
Russia warns Sweden and Finland

రష్యా సైనిక చర్యతో అందమైన ఉక్రెయిన్ దేశం శ్మశానంలా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇదే తరహా దాడులు మీపై కూడా చేస్తామని స్వీడన్, ఫిన్లాండ్ దేశాలను రష్యా హెచ్చరించింది. నాటో కూటమిలో చేరే ఆలోచనను విరమించుకోవాలని... లేకపోతే ఉక్రెయిన్ కు పట్టిన గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. 

బహిరంగంగా, దౌత్య మార్గాల ద్వారా ఆ రెండు దేశాలను హెచ్చరించినట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు. నాటోలో చేరితే ఏమవుతుందో వారికి స్పష్టంగా వివరించామని మారియా అన్నారు. రష్యా తీసుకోబోయే చర్యలపై వారు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని... రష్యా గురించి ఆ రెండు దేశాలకు బాగా తెలుసని చెప్పారు. 

నాటోలో చేరే విషయమై ఫిన్లాండ్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. నాటో కూటమిలో చేరాలని ఆ దేశ ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి ఎక్కువైంది. దీంతో, కూటమిలో చేరే దిశగా ఫిన్లాండ్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

More Telugu News