Telangana: జీవో నెంబ‌రు 111 ఎత్తివేస్తూ కొత్త జీవోను జారీ చేసిన తెలంగాణ స‌ర్కారు

telangana government cancels go no 111 with new go no 69
  • జీవో నెంబ‌రు 111 ర‌ద్దు చేస్తూ కొత్త జీవో 
  • 84 గ్రామాల్లో ఆంక్ష‌ల ఎత్తివేత‌
  • ఈ గ్రామాల్లో నిర్మాణాల‌పై ఇక ఆంక్ష‌లుండ‌వ్‌
  • కొత్త జీవో నెంబ‌రు 69 జారీ
తెలంగాణ ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ చుట్టూ ఉన్న 84 గ్రామాల‌లో నిర్మాణాలపై కొన‌సాగుతున్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. ఈ మేర‌కు జీవో నెంబ‌రు 111 పేరిట ఏళ్లుగా కొన‌సాగుతున్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తూ జీవో నెంబ‌రు 69ని జారీ చేసింది.

హైద‌రాబాద్ తాగునీటి అవ‌స‌రాల కోసం ఏర్పాటు చేసిన జంట జ‌లాశ‌యాల ప‌రిధిలో ఇక‌పై ఎలాంటి ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌రాద‌న్న దిశ‌గా గ‌త కొంత‌కాలంగా ఆలోచ‌న చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం బుధ‌వారం నాడు ఎట్ట‌కేల‌కు జీవో నెంబ‌రు 111 ను ర‌ద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అందుకోసం జీవో నెంబ‌రు 69ని జారీ చేసింది. కొత్త జీవో ప్ర‌కారం పాత జీవో ఆధారంగా అమ‌ల్లోకి వ‌చ్చిన ఆంక్ష‌ల‌న్నీ ర‌ద్దయిపోయాయి.
Telangana
GO NO.111
GO NO.69
TRS

More Telugu News