Scam: పేద క్రైస్తవులకు ఇళ్లు, పాస్టర్లకు విల్లాలు.. అంటూ రూ.50 కోట్ల మేర టోకరా

Huge scam in the name of houses for poor christians and villas to pastors
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం వెలుగులోకి..
  • 1000 చర్చిలు స్థాపిస్తామన్న గుడ్ షెపర్డ్, ఆర్ అండ్ ఆర్ సంస్థలు
  • ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు
  • 20 వేల మంది వరకు బాధితులు
  • హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1000 చర్చిలు నిర్మిస్తామని, పేద క్రైస్తవులకు ఇళ్లు కట్టిస్తామని గుడ్ షెపర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ భారీ మోసానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంతేకాదు, పాస్టర్ లకు ఖరీదైన విల్లాలు అందిస్తామంటూ వారిని కూడా ప్రలోభాలకు గురిచేసిన విషయం వెల్లడైంది. గుడ్ షెపర్డ్, ఆర్ అ అండ్ ఆర్ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లోని పేద క్రైస్తవులే లక్ష్యంగా రూ.50 కోట్ల మేర మోసగించినట్టు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 

సదరు సంస్థలు ఎంతకీ ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒక్కొక్కరి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో దాదాపు 20 వేల మంది ఈ సంస్థల చేతిలో మోసపోయినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఫౌండేషన్ చైర్మన్ రఘురామ్, సంస్థ డైరెక్టర్ సాల్మన్ రాజ్ లపై కేసు నమోదు చేశారు.
Scam
Christians
Good Sheppard
R and R
Pastors
Houses
Villas
Police
Telangana
Andhra Pradesh

More Telugu News