CM Jagan: టీడీపీ అధినేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

CM Jagan conveys birthday wishes to Chandrababu
  • 73వ పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు
  • ట్విట్టర్ లో స్పందించిన సీఎం జగన్
  • జగన్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి విశేష స్పందన
  • రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నేడు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. విష్ యూ హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారూ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. నెటిజన్లు వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. 

కాగా, చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు. తిరుపతిలోని అఖిలాండం వద్ద చంద్రబాబు క్షేమాన్ని కోరుతూ పూజలు నిర్వహించారు. టీడీపీ మీడియా విభాగం రాష్ట్ర సమన్వయకర్త శ్రీధర్ వర్మ 720 కొబ్బరికాయలు కొట్టగా, అలిపిరిలోని శ్రీవారి పాదాల వద్ద టీడీపీ కార్యకర్తలు, నేతలు 1,116 కొబ్బరికాయలు కొట్టారు.
.

  • Loading...

More Telugu News