Balakrishna: తాతినేని రామారావుగారి మరణవార్త న‌న్ను ఎంతగానో కలచివేసింది: బాలకృష్ణ‌

balakrishna expresses condolences
  • తాతినేని గొప్ప దర్శకుడన్న బాలకృష్ణ 
  • దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చారని ప్రశంస 
  • ఈరోజు ఆయ‌న‌ మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరమని వ్యాఖ్య  
  • సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడేవారు కాదన్న బాలయ్య 
ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు(84) క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాతినేని రామారావు గొప్ప దర్శకుడని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన ఆయ‌న ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరమ‌ని చెప్పారు. 

తాతినేని మరణవార్త త‌న‌ను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. త‌న తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి చరిత్రలో నిలిచిపోయే 'యమగోల' వంటి విజయవంతమైన చిత్రాలు తీశార‌ని చెప్పారు. ఆయన దర్శకత్వంలో తాను హీరోగా 'త‌ల్లిదండ్రులు' అనే సినిమాలో న‌టించాన‌ని, ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిందని తెలిపారు. 

తాతినేని నిర్మాతల‌ పక్షాన నిలబడేవార‌ని, వారికి డబ్బులు మిగలాలని ఆలోచించే వార‌ని చెప్పారు. అలాగే సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడేవారు కాద‌ని అన్నారు. బాలీవుడ్‌లోనూ ఆయ‌న‌ హిట్ సినిమాలు తీసి అక్కడ కూడా విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నార‌ని బాల‌కృష్ణ చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. తాతినే‌ని కుటుంబ సభ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. 

Balakrishna
Tollywood

More Telugu News