Tatineni Rama Rao: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత

Tollywood Senior Director Tatineni Rama Rao Passed Away
  • గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాతినేని
  • చెన్నై ఆసుపత్రిలో ఈ ఉదయం కన్నుమూత
  • 1966లో ‘నవరాత్రి’ సినిమాతో ఎంట్రీ
  • ఎన్టీఆర్, కృష్ణ వంటి దిగ్గజ నటుల సినిమాలకు దర్శకత్వం
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 

1966లో ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తాతినేని 70కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో  యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే, రాజేంద్రప్రసాద్‌తో గోల్‌మాల్ గోవిందం, సూపర్‌స్టార్ కృష్ణతో అగ్నికెరటాలు వంటి సినిమాలను తెరకెక్కించారు. తాతినేని మృతికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Tatineni Rama Rao
Tollywood
Passed Away
Director

More Telugu News