Janasena: 31 మంది కౌలు రైతు కుటుంబాల‌కు చేరిన జ‌న‌సేన ఆర్థిక సాయం

janasena handover the cheques to 31 leased farmers families
  • ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు ల‌క్ష చొప్పున ‌సాయం 
  • రైతు భ‌రోసా యాత్ర పేరిట అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన జ‌న‌సేనాని
  • మొద‌టి విడ‌త రైతు భ‌రోసా యాత్ర ముగిసింద‌ని జ‌న‌సేన ప్ర‌క‌ట‌న‌
ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతు కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున సాయాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రైతు భ‌రోసా యాత్ర‌లో భాగంగా ఆయా కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి, రూ.1 ల‌క్ష సాయాన్ని తానే స్వ‌యంగా అందించ‌నున్న‌ట్లు పవన్ ప్ర‌క‌టించిన విష‌య‌మూ విదిత‌మే. ఈ మేర‌కు అనంత‌పురం జిల్లాలో ఈ యాత్ర‌ను ప‌వ‌న్ ఇటీవ‌లే ప్రారంభించారు కూడా. 

ఈ మేర‌కు రైతు భరోసా యాత్ర మొదటి విడతలో భాగంగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 31 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్క రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప‌వ‌న్ అందించార‌ని జ‌న‌సేన మంగ‌ళ‌వారం నాడు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.
Janasena
Pawan Kalyan
Anantapur District

More Telugu News