Atchannaidu: మమ్మల్ని వేధిస్తున్న పోలీసులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు: అచ్చెన్నాయుడు

Will never leave those police who are torturing us warns Atchannaidu
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్న అచ్చెన్న 
  • దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ వేస్తామని వెల్లడి 
  • బీసీల గొంతులను వైసీపీ ప్రభుత్వం నొక్కుతోందని విమర్శ 
తమను వేధిస్తున్న పోలీసులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేధించిన పోలీసులందరి సంగతి తేలుస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ వేస్తామని... పీఎస్ ల వారీగా అందరిపై చర్య తీసుకుంటామని అన్నారు. 

సర్దార్ గౌతు లచ్చన్న 16వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి గౌతు శిరీష కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల గొంతులను వైసీపీ ప్రభుత్వం నొక్కుతోందని విమర్శించారు. బీసీలు ఆర్థికంగా ఎదగడానికి టీడీపీనే కారణమని అన్నారు. బీసీల అభివృద్ధికి సర్దార్ గౌతు లచ్చన్న ఎంతో చేశారని కొనియాడారు.
Atchannaidu
Telugudesam
YSRCP
Police

More Telugu News