Kakani Govardhan Reddy: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కౌంట‌ర్ ఇచ్చిన కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

ap minister kakani govardhan reddy counter to pawan kalyan comments
  • రైతుల్లా న‌టించే వారి గురించి మాట్లాడ‌టం వృథా అన్న కాకాణి  
  • టీడీపీ సానుభూతిప‌రుడిలా మాట్లాడుతున్నారంటూ సెటైర్ 
  • జ‌గ‌న్ హయాంలో ఏపీ  రైతులు హ్యాపీ అన్న మంత్రి  
ఏపీలో రైతుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంధించిన ప్ర‌శ్న‌ల వ‌ర్షంపై ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి స్పందించారు. రైతుల్లా న‌టించే వారి గురించి మాట్లాడ‌టం వృథా అంటూ ప‌వ‌న్ కామెంట్ల‌కు మంత్రి కౌంట‌ర్ ఇచ్చారు. టీడీపీ సానుభూతిప‌రుడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతున్నారన్న కాకాణి... సీఎం జ‌గ‌న్ హ‌యాంలో ఏపీ రైతులు హ్యాపీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

అంతకు ముందు రైతు స‌మ‌స్య‌ల‌పై ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. ప్ర‌తి రైతు కుటుంబానికి రూ.50వేల పెట్టుబ‌డి సాయం అందిస్తామ‌న్న హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టిదాకా ఎన్ని రైతు కుటుంబాల‌కు రూ.50 వేల పెట్టుబ‌డి సాయం అందించారని ప్ర‌శ్నించారు. రైతుల నుంచి కొన్న పంట‌కు డ‌బ్బులు కూడా స‌రిగ్గా చెల్లించ‌డం లేదని పవన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌ను కూడా కులాల వారీగా విభజించ‌డ‌మే ప్ర‌భుత్వం చేసిన ప‌ని అంటూ ప‌వ‌న్ వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.
Kakani Govardhan Reddy
AP Cabinet
YSRCP
Janasena
Pawan Kalyan

More Telugu News