Congress: తెలంగాణ‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై రేణుకా చౌద‌రి కీల‌క వ్యాఖ్య‌లు

  • రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయన్న రేణుక 
  • పోలీసుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారని విమర్శ 
  • సెంట్ర‌ల్ ఫోర్స్‌ను తెలంగాణ‌కు పంపాలంటూ సూచన 
  • అమిత్ షా తెలంగాణ‌కు వచ్చి శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కంట్రోల్ చేయాల‌న్న కాంగ్రెస్ నేత‌
renuka chowdary comments on telanagana law and order

తెలంగాణ‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌద‌రి మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని, రోజురోజుకీ రాష్ట్రంలో అరాచ‌కాలు పెరిగిపోతున్నాయ‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగాల‌ని కూడా ఆమె కోరారు.

ఈ సంద‌ర్భంగా రేణుకా చౌద‌రి స్పందిస్తూ...  "తెలంగాణ‌లో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయి. రాష్ట్రంలో రోజురోజుకూ అరాచ‌కాలు పెరిగిపోతున్నాయి. పోలీసుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు. మంచి పోలీసుల‌ను కూడా ప‌నిచేయ‌నివ్వ‌డం లేదు. సెంట్ర‌ల్ ఫోర్స్‌ను పంపాలి. అమిత్ షా ఢిల్లీలో కూర్చోవ‌డం స‌రికాదు. తెలంగాణ వ‌చ్చి శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కంట్రోల్ చేయాలి" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News