Kakani Govardhan Reddy: కోర్టులో చోరీతో నాకు సంబంధం లేదు: మంత్రి కాకాణి

I dont have any link to court theft incident says Kakani Govardhan Reddy
  • కోర్టులో కాకాణి ఫైలును దొంగలు ఎత్తుకెళ్లడంపై దుమారం
  • ఏ విచారణకైనా సిద్ధమన్న కాకాణి
  • సీబీఐతో కూడా విచారణ జరిపించుకోవచ్చని వ్యాఖ్య
నెల్లూరు కోర్టులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఫైలును దొంగలు ఎత్తుకుపోవడం దుమారాన్ని రేపుతోంది. కోర్టులో ఎన్నో ఫైల్స్ ఉండగా ఆయనకు చెందిన ఫైలును మాత్రమే ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ నేపథ్యంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ అంశంపై తాను ఏ విచారణకైనా సిద్ధమేనని అన్నారు. హైకోర్టుకు వెళ్లొచ్చని, లేదా సీబీఐతో విచారణ జరిపించుకోవచ్చని వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నానని, అందువల్ల ప్రభుత్వ విచారణ కూడా జరిపించుకోవచ్చని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని, అందరం కలిసి పని చేస్తామని చెప్పారు.
Kakani Govardhan Reddy
YSRCP
Court
File

More Telugu News