Shah Rukh Khan: ఓడిపోయినా కేకేఆర్ వెన్ను తట్టిన షారూక్ ఖాన్

Shah Rukh Khans tweet after KKR vs RR IPL 2022 nail biter takes internet by storm
  • అందరూ బాగా ఆడారన్న షారుక్ 
  • అద్భుతంగా కృషి చేశారంటూ ప్రశంస 
  • ఇలానే పోరాడాలి అంటూ ట్వీట్ 
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పోరాట పటిమకు ఆ జట్టు యజమాని, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ మద్దతుగా నిలిచాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి చవిచూసింది. ఓపెనర్ ఆరోన్ పింఛ్, శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ తో రాణించినా ఓటమి తప్పలేదు. దీంతో మ్యాచ్ అనంతరం షారూక్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

‘‘చాలా చక్కగా ఆడారు. శ్రేయాస్ అయ్యర్, ఆరోన్ పింఛ్, ఉమేష్ యాదవ్ అద్భుతంగా కృషి చేశారు. 150వ మ్యాచ్ సందర్భంగా సునీల్ నెరైన్ కు అభినందనలు. మనం మ్యాచ్ కోల్పోయామని తెలుసు. అయినా, ఒకవేళ కిందకు వెళ్లాల్సి వచ్చినా ఇలానే పోరాడాల్సి ఉంటుంది. మీరు తల ఎత్తుకునే ఉండాలి’’ అంటూ షారూక్ ఖాన్ ట్వీట్ చేశాడు.
Shah Rukh Khan
kkr
tweet
support

More Telugu News