Hyderabad: డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అరెస్ట్‌

  • రెండు సినిమాల‌కు స‌హాయ ద‌ర్శ‌కత్వం
  • ఆ త‌ర్వాత సినీ తార‌ల‌కు గంజాయి స‌ర‌ఫ‌రా
  • క‌ర్ణాట‌క నుంచి గంజాయి తెప్పిస్తున్న వైనం
  • స్వ‌యంగా గంజాయి త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌ట్ట హాథిరామ్‌
  •  190 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
tollywood assistant director arrested in drugs case

తెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ వ్యవ‌హారాలు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్న స‌మ‌యంలో ఇదే అంశంలో సోమ‌వారం నాడు ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. సినీ ఆర్టిస్టుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ హాథిరామ్‌ను రాచ‌కొండ‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా అత‌డి వ‌ద్ద నుంచి ఏకంగా 190 కిలోల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కురుక్షేత్రం, యుద్ధం శ‌ర‌ణం గ‌చ్ఛామీ సినిమాల‌కు స‌హాయ ద‌ర్శకుడిగా ప‌నిచేసిన హాథిరామ్‌... ఆ క్ర‌మంలోనే సినీ తార‌ల‌కు మ‌త్తు ప‌దార్థాలు... ప్ర‌త్యేకించి గంజాయిని స‌ర‌ఫ‌రా చేయ‌డం మొద‌లెట్టాడు. అందులో భాగంగా క‌ర్ణాట‌క నుంచి కారులో గంజాయిని తర‌లిస్తుండ‌గా.. అత‌డితో పాటు ఆరుగురు వ్య‌క్తుల‌ను రాచ‌కొండ పోలీసులు సోమ‌వారం అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో వ్య‌క్తి త‌ప్పించుకుని పారిపోయాడ‌ని పోలీసులు తెలిపారు.

More Telugu News