వారంలోగా పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీ నోటిఫికేష‌న్‌: మంత్రి హ‌రీశ్ రావు

harish statementon police recruitment
  • సంగారెడ్డిలో హ‌రీశ్ రావు ప‌ర్య‌ట‌న‌
  • పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన వైనం
  • అన్ని శాఖ‌ల్లోని ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డి
తెలంగాణ నిరుద్యోగుల‌కు మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు మ‌రో తీపి క‌బురు చెప్పారు. రాష్ట్రంలో భ‌ర్తీ కానున్న పోలీసు శాఖ ఉద్యోగాల కోసం వారంలోగా నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. సోమ‌వారం నాడు సంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఆయ‌న పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని శాఖ‌ల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రెండు విడ‌త‌లుగా ప‌లు ఉద్యోగాల‌కు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించిన హ‌రీశ్ రావు... వారంలోగా పోలీసు శాఖ‌లోని ఖాళీల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంద‌ని ప్ర‌కటించారు.
Go Back to Shorts
Telangana
Harish Rao
Sangareddy District

More Telugu News