Delhi Capitals: మరో ఆటగాడికి కరోనా... ఢిల్లీ జట్టుకు క్వారంటైన్!

Delhi Capitals quarantined ahead of PBKS match possible second Covid19 case in camp
  • ఢిల్లీ క్యాపిటల్స్ బృందంలో రెండో కేసు
  • గతవారం ఫిజియో పాట్రిక్ కు కరోనా నిర్ధారణ
  • దీంతో క్వారంటైన్ కు తరలింపు
  • సభ్యులు అందరికీ పరీక్షల తర్వాత నిర్ణయం
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి కలకలం రేగింది. జట్టులోని మరో ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో ఫలితం బయటపడింది. మంగళవారం పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ పూణెలో తలపడాల్సి ఉంది. ఈ లోపే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం ముంబైలో క్వారంటైన్ కు వెళ్లింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష కూడా నిర్వహించి కరోనా పాజిటివ్ ఉందా? లేదా? నిర్థారణ చేయనున్నట్టు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

సోమ, మంగళవారాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ లోని ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. గత శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్టు బయటపడడం తెలిసిందే. బయో బబుల్ లో ఉన్నప్పటికీ కరోనా వైరస్ కేసులు వెలుగు చూడడంతో 2020లోనూ ఐపీఎల్ సగంలో ఆగిపోవడం గుర్తుండే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు క్వారంటైన్ కాలం 3-4 రోజులకు తగ్గిపోయింది. కనుక మరొక రోజు అయినా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహణకు అవకాశాలు ఉంటాయి.
Delhi Capitals
quarantined
corona
second case

More Telugu News