Visakhapatnam: కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Road Accident in Kanchikacherla 15 injured
  • విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
  • లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు
  • డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న ప్రయాణికులు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Visakhapatnam
Hyderabad
Bus
Road Accident
Kanchikacherla

More Telugu News