Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ వాహనం అంబులెన్స్ గా మారిన వేళ..!

When AP IT Minister Gudivada Amarnath vehicle turns into ambulance
  • ఏపీ ఐటీ మంత్రిగా గుడివాడ అమర్నాథ్
  • అనకాపల్లి వెళుతుండగా ఘటన
  • లంకెలపాలెం వద్ద రోడ్డుపై ప్రమాద బాధితులు
  • వారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించిన మంత్రి
ఇటీవలే ఏపీ క్యాబినెట్ లో చోటు సంపాదించి, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. ఆయన తన కాన్వాయ్ లో అనకాపల్లి వెళుతుండగా, లంకెలపాలెం వద్ద రోడ్డుపై బైక్ యాక్సిడెంట్ జరిగినట్టు గుర్తించారు. 

ఇద్దరు బాధితులు గాయాలతో ఉండడం గమనించిన ఆయన వెంటనే స్పందించారు. తన కాన్వాయ్ ఆపించి, వారిద్దరిని తన వాహనంలోనే ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు, వారిద్దరికీ మెరుగైన చికిత్స అందజేయాలంటూ ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. మంత్రి చర్య పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
.
Gudivada Amarnath
IT Minister
Bike Accident
Convoy
Ambulance
YSRCP
Andhra Pradesh

More Telugu News