Rahul Gandhi: కేసీఆర్ అవినీతిని ఎండగట్టడానికే రాహుల్ గాంధీ వస్తున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy tells Rahul Gandhi tour in Telangana confirmed
  • తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు
  • మే 6న వరంగల్ లో బహిరంగ సభ
  • మే 7న తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వివరాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైందని చెప్పారు. సీఎం కేసీఆర్ అవినీతిని ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని స్పష్టం చేశారు. మే 6వ తేదీన వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ భారీ సభ నిర్వహిస్తోందని, ఈ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని వివరించారు. మే 7వ తేదీన హైదరాబాదులో పార్టీ నేతలతో రాహుల్ సమావేశమవుతారని తెలిపారు. 

మరో సంవత్సరంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.

నిజాంకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని, తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, మంత్రి పువ్వాడ అదుపులో ఉండాలని రేవంత్ హితవు పలికారు. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, ఇంట్లో దూరి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.
Rahul Gandhi
Telangana
Revanth Reddy
Congress
KCR
Puvvada Ajay Kumar

More Telugu News