Punjab: మద్యం మ‌త్తులో గురుద్వారాలోకి వెళ్లారంటూ.. పంజాబ్ సీఎంపై పోలీసు కంప్లైంట్‌

police complaint on punjab cm bhagwant mann
  • వైశాఖి ప‌ర్వ‌దినాన ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు ఆరోప‌ణ‌
  • పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత బ‌గ్గా
  • శుక్ర‌వారం ఇదే ఆరోప‌ణ‌తో మాన్‌పై ఎస్జీపీసీ ఆగ్ర‌హం
పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్‌పై శ‌నివారం ఆ రాష్ట్ర పోలీసుల‌కు ఓ ఫిర్యాదు అందింది. మ‌ద్యం మ‌త్తులో భ‌గ‌వంత్ మాన్ గురుద్వారాలోకి ప్ర‌వేశించార‌ని, దీంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని బీజేపీకి చెందిన యువ నేత తేజింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గా నేరుగా పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు భ‌గ‌వంత్ మాన్‌పై తాను పోలీసుల‌కు చేసిన ఫిర్యాదు ప్ర‌తుల‌ను బ‌గ్గా సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.

ఇదిలా ఉంటే... ఈ నెల 14న వైశాఖి సంద‌ర్భంగా తాగిన మత్తు ఇంకా దిగ‌కుండానే గురుద్వారాలోకి ప్ర‌వేశించారంటూ శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ (ఎస్జీపీసీ) భ‌గ‌వంత్ మాన్‌పై శుక్ర‌వారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి భ‌గ‌వంత్ మాన్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కూడా ఎస్జీపీసీ డిమాండ్ చేసింది. తాజాగా అదే ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ మాన్‌పై కేసు న‌మోదు చేయాలంటూ బ‌గ్గా నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.
Punjab
Bhagwant Mann
Shiromani Gurdwara Parbandhak Committee

More Telugu News