KTR: అరుదైన ఫొటో.. పీపీఈ కిట్‌ల‌లో ఉన్న ఈ ఇద్ద‌రెవ‌రంటే..!

  • పీపీఈ కిట్ల‌లో కేటీఆర్‌, జ‌యేశ్ రంజ‌న్‌
  • ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఐఏస్ అధికారి
  • అరుదైన ఫొటోగా కామెంట్ పోస్ట్ చేసిన వైనం
ktr and jayesh ranjan in ppe kits

ఇక్కడున్న ఫొటోలో పై నుంచి కింది దాకా తెల్ల‌ని పీపీఈ కిట్‌లో క‌నిపిస్తున్న వీరిద్ద‌రూ ఎవ‌ర‌న్న విష‌యం ‌టక్కున చెప్ప‌డం చాలా క‌ష్ట‌మే. ఎందుకంటే... కేవ‌లం క‌ళ్లు మాత్ర‌మే క‌నిపిస్తున్న ఈ ఇద్ద‌రు వ్య‌క్తులను గుర్తు ప‌ట్ట‌డం అంటే కాస్తంత క‌ష్ట‌మే క‌దా. 

అయితే కాస్తంత క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే మాత్రం వీరిలో ఓ వ్య‌క్తిని మాత్రం టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ గా గుర్తించొచ్చు. మ‌రి ఆయ‌న ప‌క్క‌నున్న‌ది ఎవ‌ర‌ని ఎంత‌గా ప‌రిశీలించినా గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. ఆ రెండో వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు, నిత్యం కేటీఆర్ వెన్నంటి ఉండే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌. 

అయినా వీరిద్ద‌రు ఇలా పీపీఈ కిట్ల‌లో ద‌ర్శ‌నమిచ్చారెందుకు? అన్న‌ది తెలియ‌దు గానీ.. శుక్రవారం నాడు వీరిద్ద‌రూ క‌లిసి ఈ ఫొటో ఇలా తీయించుకున్నారు. ఈ ఫొటోను స్వ‌యంగా జ‌యేశ్ రంజ‌నే త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గ‌డ‌చిన ఏడేళ్లుగా కేటీఆర్‌తో క‌లిసి ఎన్నెన్నో ఫొటోలు దిగాన‌ని చెప్పిన జ‌యేశ్‌.. శ‌నివారం తీయించుకున్న ఈ ఫొటో మాత్రం అరుదైన‌దేన‌ని ఆ ఫొటోకు కామెంట్ పోస్ట్ చేశారు.

More Telugu News