Vijayasai Reddy: జగన్ ను తల్లి, చెల్లి, బావ ఛీకొట్టి పోవడం కంటే పెద్ద ఛీత్కారం ఏముంటుంది వీసా రెడ్డి?: అయ్యన్నపాత్రుడు

Jagan mother and sister left him says Ayyanna Patrudu
  • విజయసాయిపై ట్విట్టర్ వేదికగా అయ్యన్న విమర్శలు
  • త్వరలోనే మీకు, జగన్ కు పదవులు పోతాయని వ్యాఖ్య
  • జాబ్ మేళాలో మీరు ఉద్యోగాలు రిజర్వ్ చేసుకోవాలని హితవు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఇంట్లో వాళ్లు ఎవరినీ లెక్క చేయడం లేదనే విషయం సమాజం మొత్తం చూసిందని చెప్పారు. జగన్ ను ఆయన తల్లి, చెల్లి, బావ ఛీకొట్టి పక్క రాష్ట్రానికి వెళ్లడం కంటే పెద్ద ఛీత్కారం ఏముంటుంది వీసా రెడ్డీ? అని ఆయన ప్రశ్నించారు.

 త్వరలోనే నీకు రాజ్యసభ, జగన్ కు సీఎం పదవి పోతుందని అన్నారు. వైసీపీ కార్యకర్తల కోసం మీరు నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ముందు జాగ్రత్త చర్యగా మీరు ఉద్యోగాలను రిజర్వ్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహించడం కాదని... మీరు ఇచ్చిన హామీ మేరకు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జగన్ కు, మీకు నిరుద్యోగులు బడిత పూజ చేయడం ఖాయమని అన్నారు.
Vijayasai Reddy
Jagan
YSRCP
Ayyanna Patrudu
Telugudesam

More Telugu News