ట్విట్టర్ అకౌంట్ పేరు మార్చేసిన చిరంజీవి.. మనసుకు హత్తుకునే చరణ్ వీడియో పోస్ట్!

  • ‘ఆచార్య’గా ట్విట్టర్ అకౌంట్ రూపాంతరం
  • అందరికీ హనుమ జన్మదిన శుభాకాంక్షలు
  • వానరానికి చరణ్ బిస్కెట్లు పెడుతున్న వీడియో పోస్ట్
మెగాస్టార్ చిరంజీవిని కొరటాల శివ ‘ఆచార్య’గా మార్చేశారు. సినిమాలోనే కాదు.. ట్విట్టర్ అకౌంట్ లోనూ చిరంజీవి అలా మారిపోయారు. తన ట్విట్టర్ ఖాతా పేరును ‘ఆచార్య’గా మార్చుకున్నారు. 

మరోవైపు ఆయన ఇవాళ తన కుమారుడు రామ్ చరణ్ కు సంబంధించి మనసుకు హత్తుకునే ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిరంజీవికి స్వతహాగా హనుమంతుడంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. ఇవాళ హనుమ జన్మదినం పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. ఆ వీడియోను అందరితోనూ పంచుకున్నారు.  

కాటేజీలో మేకప్ వేసుకుంటూ రామ్ చరణ్ రెడీ అవుతుండగా.. హనుమ ప్రతిరూపమైన ఓ వానరం అక్కడకు వచ్చింది. మేకప్ వేసుకున్నంత సేపు అక్కడే తారాడింది. మేకప్ వేసుకోవడం పూర్తయిన తర్వాత చరణ్.. ఆ వానరానికి బిస్కెట్లను అందించాడు. ఆ వీడియోకు హనుమ శ్లోకమైన ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ను బ్యాగ్రాండ్ గా చిరంజీవి పెట్టారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Chiranjeevi
Twitter
Account
Hanuman Birth Day
Ramcharan
Tollywood

More Telugu News