ముగిసిన గడువు.. రూ. 302 కోట్ల ట్రాఫిక్ చలానాల వసూలు

Rs 302 Cr Pending Traffic Challans Paid
  • 5 కోట్ల పెండింగ్ చలానాలకు గాను 3 కోట్ల చలానాలు మాత్రమే వసూలు
  • మొత్తంగా రూ. 1,015 కోట్ల చలానాలు జారీ
  • గడువు పెంపును సద్వినియోగం చేసుకున్న వాహనదారులు
పెండింగ్ చలానాలను రాయితీపై చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన గడువు నిన్నటితో ముగిసింది. చివరి రోజు కూడా చలానాలు భారీగా వసూలయ్యాయి. నిజానికి ఈ గడువు ఇదివరకే ముగియగా, ఈ నెల 15 వరకు దానిని పొడిగించింది. దీంతో గతంలో చెల్లించలేకపోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 

నిన్న రాత్రి 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 302 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా ఐదు కోట్ల పెండింగ్ చలానాలకు గాను 3 కోట్ల చలానాలు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం రూ.1,015 కోట్ల చలానాలు జారీ చేయగా, రాయితీ పోను రూ. 302 కోట్లు వసూలైనట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Traffic Police
Challan
Telangana

More Telugu News