Telangana: తెలంగాణ‌లోనే స్టెంట్ల ఉత్ప‌త్తి.. ఎస్ఎంటీ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

ktr formally inaugurated the Sahajanand Medical Technologies plant
  • సంగారెడ్డి ప‌రిధిలో మెడిక‌ల్ డివైజెస్ పార్క్‌
  • పార్క్‌లో స్టెంట్ల త‌యారీ ప్లాంటు ఏర్పాటుకు ఎస్ఎంటీ ఒప్పందం
  • నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌
గుండె జ‌బ్బులున్న వారికి అమ‌ర్చే స్టెంట్ల ఉత్ప‌త్తి ఇక‌పై తెలంగాణ‌లోనే జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు స్టెంట్ల ఉత్ప‌త్తిలో ఉన్న స‌హ‌జానంద్ మెడిక‌ల్ టెక్నాల‌జీస్ (ఎస్ఎంటీ)కి చెందిన స్టెంట్ల త‌యారీ ప్లాంటును తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం సాయంత్రం లాంఛ‌నంగా ప్రారంభించారు. 

సంగారెడ్డి ప‌రిధిలోని తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేసిన మెడిక‌ల్ డివైజెస్ పార్క్‌లో స్టెంట్ల త‌యారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఎస్ఎంటీ ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కే తెలంగాణ స‌ర్కారుతో ఎస్ఎంటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకోగా... ఆ ఒప్పందం మేర‌కు ఆ సంస్థ మెడిక‌ల్ డివైజెస్ పార్క్‌లో త‌న త‌యారీ ప్లాంట్‌ను నిర్మించింది. ఈ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ నేడు లాంఛ‌నంగా ప్రారంభించారు.
Telangana
Sahajanand Medical Technologies
KTR
TRS
Medical Devices Park
SMTStents

More Telugu News