Chandrababu: హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు చంద్ర‌బాబు... టీ టీడీపీ నేత‌ల‌తో స‌మావేశం

chandrababu meeting in ntr trust bgavan in hyderabad with t tdp leaders
  • టీ టీడీపీ నేత‌లో విడివిడిగా చంద్ర‌బాబు భేటీ
  • తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై శ్రేణుల‌కు దిశానిర్దేశం
  • పార్టీ ఆవిర్భావ వేడుక‌ల సందర్భంగానూ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు చంద్ర‌బాబు
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ తెలంగాణ శాఖ‌కు చెందిన ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ కానున్నారు. అంతేకాకుండా నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న విడివిడిగా భేటీ అవుతారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై చంద్ర‌బాబు పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. 

ఇటీవ‌లి కాలంలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ వైపే చూడ‌ని చంద్ర‌బాబు చాలా కాలం త‌ర్వాత ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు వెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగానూ చంద్ర‌బాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వన్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే.  
Chandrababu
TDP
NTR Trust Bhavan
T TDP

More Telugu News