Sarkaru Vaari Paata: ఓ రేంజ్ లో 'సర్కారు వారి పాట' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్!

  • మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం
  • మే 12న భారీ స్థాయిలో విడుదలవబోతున్న సినిమా
  • తెలుగు రాష్ట్రాల్లో రూ. 80 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్
Sarkaru Vaari Paata theatrical business

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. 

మరోవైపు, ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని ఫిలింనగర్ సమాచారం. నైజాం థియేట్రికల్ హక్కులు రూ. 30 కోట్లకు, ఆంధ్రప్రదేశ్ రైట్స్ రూ. 50 కోట్ల వరకు వెళ్లాయని తెలుస్తోంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 80 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

More Telugu News