CPI Narayana: సీపీఐ నారాయణ అర్ధాంగి వసుమతి కన్నుమూత

CPI Narayana wife Vasumathi dies of illness
  • అనారోగ్యంతో బాధపడుతున్న వసుమతి
  • తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచిన వైనం
  • గతంలో బ్యాంకు ఉద్యోగినిగా పనిచేసిన వసుమతి  
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అర్ధాంగి వసుమతి కన్నుమూశారు. వసుమతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నారాయణ నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. 

ఈ విషయం తెలిసిన వెంటనే వామపక్ష నేతలు, ఇతర పార్టీల ప్రముఖులు నారాయణకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వసుమతి మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు. వసుమతి అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని ఐనంబాకం వద్ద నిర్వహించనున్నారు. 

వసుమతి గతంలో బ్యాంక్ ఉద్యోగినిగా పనిచేశారు. కాగా, ఆమెకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వైద్యులు మూడ్రోజుల కిందట స్టెంట్ అమర్చారు. కానీ, వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు.
CPI Narayana
Vasumathi
Illness
Tirupati

More Telugu News