బైడెన్, కమలా హ్యారిస్ పై సౌదీ ప్రభుత్వ మీడియా వ్యంగ్య షో.. ఇదిగో వీడియో
- రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రత్యేక షో
- కన్ ఫ్యూజింగ్, మతిమరుపు అధ్యక్షుడిగా బైడెన్ ను చూపించిన వైనం
- ‘ఫస్ట్ లేడీ’కీ తేడా తెలియదన్నట్టుగా బైడెన్ పాత్ర
అయితే, అవన్నీ పక్కనపెడితే.. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన మీడియా సంస్థ ‘ఎంబీసీ’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై చేసిన వ్యంగ్య షో వీడియో అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. బైడెన్ ను ఓ గందరగోళ, మతిమరుపు అధ్యక్షుడిగా చూపించిన ఆ వ్యంగ్య షో.. సోమవారం ప్రసారమైంది. ఆ చానెల్ లో సౌదీ ప్రభుత్వానికే మెజారిటీ వాటా ఉండడం విశేషం.
ఆ షో ప్రకారం బైడెన్, కమలా హారిస్ లు.. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై మీడియాతో మాట్లాడేందుకు వస్తారు. ఆ క్రమంలోనే మాట్లాడే పోడియంను దాటి బైడెన్ ముందుకెళ్లిపోతారు. వెంటనే కమలా హారిస్ ఆయన్ను వెనక్కు తీసుకొచ్చేస్తుంది.
అయితే, ప్రసంగాన్ని మొదలుపెట్టగానే రష్యాకు బదులు స్పెయిన్, ఆఫ్రికా అని బైడెన్ వేషధారి అంటాడు. ఆయన తప్పులను పక్కనే ఉన్న కమల వేషధారి సవరిస్తుంటుంది. రష్యా అధ్యక్షుడి పేరు కూడా తెలియదన్నట్టుగా బైడెన్ పాత్రను రూపొందించారు.
అంతేకాదు.. కమలా హ్యారిస్ ను పట్టుకుని ‘ఫస్ట్ లేడీ’ అని బైడెన్ పాత్ర అనడం ఆ షోకే హైలైట్. ఇంకో హైలైట్ ఏంటంటే.. పుతిన్ కు ఓ మాట చెప్పాలనుకుంటున్నా అంటూనే బైడెన్ పాత్ర నిద్రలోకి ఉపక్రమిస్తుంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.