srinu vaitla: శ్రీ‌ను వైట్ల నాకు చేసిన మేలు మ‌ర‌వ‌లేను: రామ జోగ‌య్య శాస్త్రి

ram jogaish on srinu vaitla
  • 'ఢీ' సినిమా వచ్చి 15 సంవత్సరాలు పూర్తి అవుతోన్న నేప‌థ్యంలో ట్వీట్
  • తాను ఇంతవరకు రావడంలో శ్రీ‌ను వైట్ల‌ పాత్ర మరువలేన‌‌న్న శాస్త్రి
  • తొలి రోజుల్లో త‌న‌ ప్రతిభను గుర్తించార‌ని వ్యాఖ్య‌
  • త‌న‌ను నమ్మార‌ని ట్వీట్
సినీ దర్శకుడు శ్రీను వైట్ల గురించి ప్రముఖ సినీ గేయ ర‌చ‌యిత‌ రామ జోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన 'ఢీ' సినిమా వచ్చి 15 సంవత్సరాలు పూర్తి అవుతోన్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. 

తాను ఇంత వరకు రావడంలో శ్రీ‌ను వైట్ల‌ పాత్ర మరువలేనిదని చెప్పారు. తొలి రోజుల్లో త‌న‌ ప్రతిభను గుర్తించార‌ని, త‌న‌ను నమ్మార‌ని ఆయ‌న తెలిపారు. శ్రీ‌ను వైట్ల త‌నకు చేసిన మేలు మ‌ర‌వ‌లేన‌ని అన్నారు. 'ఢీ' సినిమా త‌న‌కు ప్రత్యేకమైన సినిమా అని చెప్పారు. 'ఢీ' టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్న‌ట్లు తెలిపారు. 
 

srinu vaitla
Tollywood

More Telugu News