తెలంగాణలో వయో పరిమితి పెంపు.. ఏఏ ఉద్యోగాలకంటే..!
- యూనిఫాం ఉద్యోగాలకు మూడేళ్ల వయో పరిమితి పెంపు
- రెండేళ్ల పాటు అమలులో వయో పరిమితి పెంపు
- ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ
తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు చెందిన ఉద్యోగాలకు ఈ వయో పరిమితి వర్తించనుంది. గరిష్ఠ వయో పరిమితిని మూడేళ్లకు పెంచిన ప్రభుత్వం... ఈ వయో పరిమితి సడలింపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది.