MS Dhoni: మూడు క్యాచ్ లు మిస్ చేసిన ముకేశ్.. క్లాసు పీకిన ధోనీ

MS Dhonis reaction after CSKs Mukesh Choudhary drops 3 catches vs RCB
  • ఫీల్డింగ్ పరంగా నిరాశపరిచిన యువ పేసర్
  • వరుసగా క్యాచ్ లు పట్టడంలో విఫలం
  • దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి మాట్లాడిన ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ ముకేశ్ చౌదరి బంగారం లాంటి మూడు క్యాచ్ లు మిస్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. రాయల్ చాలెంజర్స్ తో మంగళవారం నాటి మ్యాచ్ లో అటు బౌలింగ్ లో రాణించకపోగా.. ఫీల్డింగ్ లోనూ ఎన్నో తప్పులు చేసి నిరాశకు గురిచేశాడు. 

మొత్తం 3 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన ముకేశ్ చౌదరి 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఒకేఒక్క వికెట్ పడగొట్టాడు. ఇది పెద్ద ఇబ్బంది పెట్టలేదు కానీ, అతడు జారవిడిచిన క్యాచ్ లే అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. 

మాజీ కెప్టెన్ ధోనీ సైతం ముకేశ్ కు ఈ విషయంలో బోధన చేయాల్సి వచ్చింది. నిజానికి మ్యాచ్ లో సీఎస్కే వైపు నుంచి ఫీల్డింగ్ లోపాలు చాలా కనిపించాయి. రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే ఉతుకుడు వల్ల భారీ స్కోరు సాధించడం జట్టు విజయానికి కలిసొచ్చింది. ఫీల్డింగ్ లో ఎన్ని తప్పులు దొర్లినా ఆఖరికి విజయం దక్కించుకోగలిగింది.

షాబాజ్ అహ్మద్ వికెట్ ను మహీష్ తీక్షణ పడగొట్టిన వెంటనే ధోనీ వేగంగా నడుచుకుంటూ ముకేశ్ చౌదరి దగ్గరకు వెళ్లాడు. భుజంపై చేయి వేసి అతడికి ముఖ్య సూచనలు చేశాడు. ఫీల్డింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తు చేశాడు. ఇది చూసిన అభిమానులు కెప్టెన్ ధోనీ, లీడర్ అంటూ ప్రశంసించారు.
MS Dhoni
CSK
Mukesh Choudhary
drops
catches

More Telugu News