Deoghar: ముగిసిన దేవ్ గఢ్ రోప్ వే ప్రమాద ఘటన రెస్క్యూ ఆపరేషన్

  • త్రికూట పర్వతాల వద్ద ప్రమాదం
  • ఢీకొన్న కేబుల్ కార్లు
  • గాల్లోనే 45 గంటల పాటు చిక్కుకుపోయిన ప్రజలు
  • హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు
Deoghar rope way accident rescue operation concluded

ఝార్ఖండ్ లోని ప్రఖ్యాత పర్యాటక స్థలం త్రికూట పర్వతాల వద్ద రోప్ వే ప్రమాదం సంభవించడం తెలిసిందే. బైద్యనాథ్ ఆలయానికి దారితీసే రోప్ వేలో రెండు కేబుల్ కార్లు ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం. దాంతో కేబుల్ కార్లలోని ప్రజలు 45 గంటలపాటు గాల్లోనే చిక్కుకుపోయారు. 

కాగా, అధికారులు వాయుసేన సాయం చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయి. 45 మందిని కాపాడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాద ఘటనను ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రమాదం జరిగిన తీరుపై విచారణకు ఆదేశించింది. ఈ నెల 26న వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

More Telugu News