Uttar Pradesh: రూ.5 వేలు ఇవ్వనందుకు భార్య ఆత్మహత్య.. ఆమె చితిలోకి దూకేసిన భర్త

Woman kills Self for not giving rs 5000 her husband jumps into her pyre
  • ఉత్తరప్రదేశ్ లోని మహోబాలో ఘటన
  • భర్తను కాపాడిన స్థానికులు
  • హత్య అని ఆరోపిస్తున్న మహిళ తల్లిదండ్రులు
‘ఆరోగ్యం బాగాలేదు.. డాక్టర్ కు చూపించుకుంటాను రూ.5 వేలు ఇవ్వు’ అని భర్తను అడిగిందా భార్య. ‘ఇప్పుడు లేవు.. రేపు ఇస్తాను’ అని ఆ భర్త చెప్పాడు. అంతే.. ఆ భార్యకు కోపమొచ్చి అదే రాత్రి ప్రాణం తీసేసుకుంది. తెల్లారి భార్య అంత్యక్రియల సమయంలో బాధతో చితిలోకి దూకేశాడు భర్త. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహోబాలోని జైత్ పూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 

చనిపోయిన మహిళను ఉమ అని తెలిపారు. చితిలోకి దూకిన ఆమె భర్త బ్రజేశ్ ను స్థానికులు కాపాడి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారని చెప్పారు. అయితే, ఉమ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. ఉమ భర్త, ఆమె అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, తమ కూతురు డబ్బులు ఇవ్వనన్న చిన్న కారణానికే చనిపోయేంత పిరికిది కాదని చెప్పారు. 

Uttar Pradesh
Crime News
Wife
Husband
Pyre

More Telugu News