Deoghar: రోప్ వే ప్రమాదం.. తీగలపైనే 14 ప్రాణాలు.. కాపాడుతుండగా జారి పడిపోయిన ఒక వ్యక్తి

  • ఝార్ఖండ్ రాష్ట్రంలోని త్రికూట పర్వతాలపై ప్రమాదం
  • 30 మందిని కాపాడిన వాయుసేన
  • కొనసాగుతున్న సహాయక కార్యక్రమం
  • ఒక వ్యక్తిని కాపాడుతుండగా విషాదం
Deoghar ropeway accident 14 hang on for life as rescue ops begin

ఝార్ఖండ్ రాష్ట్రంలోని దియోగఢ్ వద్ద త్రికూట పర్వతాలపై ఆదివారం సాయంత్రం జరిగిన రోప్ వే ప్రమాదంలో 30 మందిని భారత వాయుసేన కాపాడింది. మంగళవారం ఉదయానికి మరో 14 మంది పర్యాటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు ఒకరు మరణించారు. వాయుసేన హెలికాప్టర్ లోకి వ్యక్తిని తాడు సాయంతో తీసుకెళ్లే ప్రయత్నంలో చేయి జారడంతో అతడు కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రోప్ వే మార్గంలో రెండు కేబుల్ కార్లు ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం. 

శ్రీరామనవమి సందర్భంగా త్రికూట పర్వతాల్లోని బాబా బైద్యనాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు శని, ఆదివారాల్లో వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. రోప్ వే మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ప్రమాదంపై దర్యాప్తునకు సీఎం హేమంత్ సోరేన్ ఆదేశించడం గమనార్హం.

More Telugu News