arvind: బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి ముందు రైతులు ట్రాక్టర్‌తో వడ్లు పోసిన వైనం

ruckus at arvind home
  • ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో ఆందోళ‌న‌
  • అరవింద్ ఇంటి వద్ద కొంద‌రు రైతుల నిర‌స‌న 
  • ఆయ‌న‌కు వ్యతిరేకంగా  నినాదాలు
ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతోన్న విష‌యం తెలిసిందే. ప‌ర‌స్ప‌రం ఆ పార్టీల నేత‌లు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద కొంద‌రు రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 

అరవింద్ ఇంటి ముందు ట్రాక్టర్‌తో రైతులు వడ్లు పోయ‌డం క‌ల‌క‌లం రేపింది. మరోపక్క, అరవింద్‌కు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వమే వడ్లు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
arvind
BJP
TRS

More Telugu News