రేపు అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
- ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతులు
- బాధిత కుటుంబాలను పరామర్శించనున్న పవన్
- ఆర్థికసాయం అందించనున్నవైనం
పర్యటన షెడ్యూల్ ఇదిగో...
- మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరిక. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రౌతు కుటుంబానికి ఆర్థికసాయం అందజేత.
- కొత్తచెరువు గ్రామం నుంచి 10.30 గంటలకు బయల్దేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబానికి పరామర్శ. ఆర్థికసాయం అందజేత.
- 11.20 గంటలకు ధర్మవరం నుంచి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి పయనం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆర్థికసాయం అందజేత.
- అక్కడి నుంచి 12.10 గంటలకు బయల్దేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి రాక. 20 రోజుల కింద ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబానికి ఓదార్పు.. ఆర్థికసాయం.
- చివరగా అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరిక. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలురైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత.
- అదే గ్రామంలో రచ్చబండ గ్రామసభ కార్యక్రమం నిర్వహణ.
- మరికొందరు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత.
- సభ అనంతరం హైదరాబాద్ కు పయనం.