Nagababu: వాళ్లను చూస్తే నాకూ 'అయ్యో పాపం' అనిపించింది.. ‘మంత్రులకు నా మనవి’ అంటూ నాగబాబు వ్యంగ్యాస్త్రాలు

  • నిన్న మంత్రి పదవి దక్కని వారు కన్నీరుపెట్టుకున్న వైనం
  • వాళ్లను చూస్తే తనకూ బాధేసిందన్న నాగబాబు
  • ప్రజల బాధలపైనా అలాంటి ఆవేదన, ఫ్రస్ట్రేషన్ చూపిస్తే బాగుండేదని కామెంట్
Nagababu Sattires On Ex Ministers

వైసీపీ నేతలు, మంత్రి పదవి దక్కని వారిపై నాగబాబు సెటైర్ వేశారు. ‘వైసీపీ మంత్రులకు నా మనవి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీలో మంత్రి పదవులు రానివాళ్లు, మంత్రి పదవులు పోయిన వారి ఫ్రస్ట్రేషన్, బాధ, కుమిలిపోవడం, కొంతమంది కన్నీరు పెట్టుకోవడం చూస్తే తనకూ బాధేసిందని, అయ్యో పాపం అనిపించిందని కామెంట్ చేశారు. 

అయితే, కౌలు రైతుల ఆత్మహత్యలు, ఇతర ఉత్పత్తి కులాల్లో చనిపోయిన ప్రజలు, ఉద్యోగాలు రాని యువత, రాజధాని ప్రజల కడుపుమంట, ఉద్యోగులు పడుతున్న బాధలు, నాశనం అయిపోయిన మౌలిక సదుపాయాలు, ఆ సదుపాయాల్లేక నిత్యం చస్తున్న ప్రజలు (లిస్ట్ చాంతాడంత ఉంది లెండి), వారు పడుతున్న బాధలపైనా ఇదే కన్నీరు, ఫ్రస్ట్రేషన్, బాధ, వారిపై ప్రేమ చూపిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.  

ఇవాళ కొత్త మంత్రివర్గం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. 11 మంది పాత మంత్రులు సహా మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు.

More Telugu News