Consumption: అధిక కొలెస్ట్రాల్ ఉంటే కనీసం వీటినైనా దూరం పెట్టండి..!

  • రెడ్ మీట్ తీసుకోకపోవడం మంచిది
  • ప్రాసెస్డ్ మీట్ అసలే వద్దు
  • బేక్డ్, ఫ్రైడ్ ఫుడ్స్ తో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది
  • స్వీట్స్ ను తగ్గించుకోవాలి
Experts Warn Against Consumption Of These Food Items

రక్తంలో కొలెస్ట్రాల్ అధిక స్థాయులకు చేరితే అది ప్రాణాలకే ముప్పు. హార్ట్ ఎటాక్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్ కు దారితీయవచ్చు. అందుకే మధ్య వయసు నుంచి కొలెస్ట్రాల్ ను నిర్లక్ష్యం చేయవద్దు. ఇందుకోసం ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలి. కొలెస్ట్రాల్ రిస్క్ ను తగ్గించుకునే చిత్తశుద్ధి ఉన్నవారు కనీసం కొన్ని రకాల ఆహార పదార్థాలను అయినా దూరం పెట్టాలి.
 
రెడ్ మీట్
రెడ్ మీట్ (మటన్) అన్నది కొలెస్ట్రాల్ ను పెంచేసే ఆహారం. అందుకనే దీన్ని తీసుకోవద్దని వైద్యులు సూచిస్తుంటారు. గొడ్డు మాంసం, పంది మాంసం, గొర్రె, మేక మాంసంలో ఫ్యాట్ ఎక్కువ. పూర్తిగా వీటిని త్యజించలేకపోయినా.. అరుదుగా తీసుకోవడానికే పరిమితం కావడం కొలెస్ట్రాల్ కు మంచిది. 

ప్రాసెస్డ్ మీట్
శుద్ధి చేసిన (ప్రాసెస్ చేసిన) మాంసం కూడా కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారమే. అధిక కొలెస్ట్రాల్ కు తోడు శాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఇందులో ఎక్కువ. ఇది గుండె ఆరోగ్యానికి చెడు చేస్తుంది. ఇప్పటికే కొలెస్ట్రాల్ ఉన్న వారు అసలు వీటి జోలికి పోకపోవడమే మంచిది.

బేక్డ్ ఫుడ్
కుకీలు, ప్యాస్ట్రీలను ఎంతో మంది ఇష్టపడతారు. అధిక వెన్న, చక్కెరతో, కాల్చి చేసే వీటితో జాగ్రత్తగా ఉండాలన్నది వైద్యుల సూచన. ఈ ఆహారం కొలెస్ట్రాల్ ను పెంచేస్తుంది. ఇప్పటికే పరిమితికి మించి కొలెస్ట్రాల్ ఉన్న వారికి హానికరమే.

ఫ్రైడ్ ఫుడ్స్
నూనెలో వేయించిన పదార్థాలు కూడా చెడు కొలెస్ట్రాల్ కు కారణమవుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎవరు ఇష్టపడరు? ఎక్కువ సమయం పాటు నూనెలో వీటిని వేయించడం వల్ల ఎనర్జీ డెన్సిటీ పెరుగుతుంది. అంటే కేలరీలు పెరిగిపోతాయి. అందుకనే ఆలూ ఫ్రైస్ కు దూరంగా ఉండాలి. అంతేకాదు వేపుళ్లను కూడా తీసుకోవద్దు. 

తీపి పదార్థాలు
మిఠాయిలు తింటే ఆ సంతృప్తి వేరు. కానీ, 35 ఏళ్లు దాటిన వారు వీటిని తగ్గించుకోవాలి. వీటి రూపంలో శరీరంలోకి అధిక కేలరీలు చేరతాయి. ఖర్చు కాగా, మిగిలిపోయినవి కొవ్వుగా మారతాయి. ఇదే కొలెస్ట్రాల్ రూపం దాలుస్తుంది.

More Telugu News