Tamilisai Soundararajan: రెండ్రోజుల పర్యటనకు రైల్లో భద్రాచలం వెళ్లిన గవర్నర్ తమిళిసై

Telangana governor Tamilisai goes to Bhadrachalam by train
  • టీఆర్ఎస్ సర్కారుతో తమిళిసై వార్
  • పరస్పరం మాటల దాడులు
  • తాను రోడ్డు, రైలు మార్గాల్లోనే ప్రయాణించగలనన్న తమిళిసై
  • ఎందుకో అందరికీ తెలుసని ఇటీవల వ్యాఖ్య  
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో తాను ప్రస్తుతం రోడ్డు, రైలు మార్గాల ద్వారానే ప్రయాణించగలనని, ఎందుకో మీరే అర్థం చేసుకోవాలని ఇటీవల తమిళిసై వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, ఆమె రెండ్రోజుల పర్యటన నిమిత్తం రైలులో భద్రాచలంకు వెళ్లారు. 

మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బోగీలో ఆమె సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ భద్రాద్రిలో జరిగే సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాలకు హాజరవుతారు.
Tamilisai Soundararajan
Bhadrachalam
Train
TRS Govt
Telangana

More Telugu News