Governor: కొత్త మంత్రుల జాబితాకు ఆమోదముద్ర వేసిన ఏపీ గవర్నర్

AP Governor approves new cabinet
  • 25 మందితో నూతన క్యాబినెట్ ఖరారు
  • జాబితాను రాజ్ భవన్ కు పంపిన రాష్ట్ర సర్కారు
  • లాంఛనం ముగించిన గవర్నర్
  • రేపు ఉదయం 11.31 గంటలకు ప్రమాణస్వీకారం
ఏపీలో నూతన మంత్రివర్గానికి సంబంధించి ఓ లాంఛనం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపించిన కొత్త మంత్రుల జాబితాకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. ఇక కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఒక్కటే మిగిలుంది. రేపు ఉదయం 11.31 గంటలకు నూతన మంత్రివర్గ సభ్యులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 

సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కోర్ కమిటీ తీవ్ర కసరత్తుల అనంతరం 25 మందితో నూతన క్యాబినెట్ కు రూపకల్పన చేయడం తెలిసిందే. వీరిలో 11 మంది పాతమంత్రులే ఉండగా, 14 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు. వారిలో రోజా, అంబటి రాంబాబు, విడదల రజని, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేశ్, గుడివాడ అమర్నాథ్ వంటి ప్రముఖులు ఉన్నారు.
Governor
New Cabinet
YSRCP
Andhra Pradesh

More Telugu News