Hetmyer: హెట్మెయర్ సిక్సర్ల జోరు... గౌరవప్రద స్కోరు సాధించిన రాజస్థాన్ రాయల్స్

Hetmyer huge sixes guides Rajasthan Royals to respectable score
  • రాజస్థాన్ వర్సెస్ లక్నో
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 రన్స్
  • 6 సిక్సులు బాదిన హెట్మెయర్
లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు షిమ్రోన్ హెట్మెయర్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓ దశలో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టును హెట్మెయర్, అశ్విన్ జోడీ ఆదుకుంది. 

అశ్విన్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అయితే, హెట్మెయర్ మాత్రం బంతికి చుక్కలు చూపించాడు. ఓవరాల్ గా హెట్మెయర్ 36 బంతులాడి  59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 1 ఫోర్, 6 భారీ సిక్సులు ఉన్నాయి.
Hetmyer
Rajasthan Royals
Lucknow Supergiants
IPL

More Telugu News