ఆర్ఆర్ఆర్ సంచలనం.. రూ.1,000 కోట్లు దాటిన వసూళ్లు
- 16 రోజుల్లోనే బ్రహ్మాండమైన రికార్డు
- రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసినవి మూడే సినిమాలు
- అందులో రెండు రాజమౌళి దర్శకత్వం వహించినవే
విజయేంద్ర ప్రసాద్ కథ రాయగా, ఆయన కుమారుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తెలిసిందే. కొమరంభీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య రూ.450 కోట్లను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేశారు. మార్చి 25న ఈ సినిమా థియోటర్లలోకి రాగా 16 రోజుల్లోనే పెద్ద ఎత్తున కలెక్షన్లు వసూలు చేసుకుందని చెప్పుకోవాలి.