AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారు

mugurthamfixed for ap new cabinet oath taking ceremony
  • 11న ఉద‌యం 11.31 గంట‌ల‌కు ప్ర‌మాణం
  • అసెంబ్లీ ప‌క్క‌న ఖాళీ స్థ‌లంలో వేదిక‌
  • తుది జాబితాను సిద్ధం చేసిన సీఎం జ‌గ‌న్‌
ఏపీలో కొత్త కేబినెట్ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారైపోయింది. ఈ నెల 11న ఉద‌యం 11.31 గంట‌ల‌కు కొత్త కేబినెట్ మంత్రుల ప్ర‌మాణ స్వీకారం మొద‌లుకానుంది. అమ‌రావ‌తిలోని అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయం ప‌క్క‌న ఉన్న ఖాళీ స్థ‌లంలో కొత్త కేబినెట్ ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జ‌రుగుతున్నాయి. తాజాగా ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖ‌రారు కావడంతో ఇక మంత్రుల ప్ర‌మాణ‌మే త‌రువాయిగా మారింది.

త‌న కేబినెట్‌లోని మొత్తం 24 మందితో రాజీనామాలు చేయించిన జ‌గ‌న్.. కొత్త వారితో మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం రాజీనామాలు చేసిన వారిలో కొంద‌రిని కూడా కొత్త కేబినెట్‌లోకి తీసుకుంటాన‌ని ఆయ‌న పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కొత్త కేబినెట్‌లో ఎవ‌రెవ‌రు ఉండాల‌న్న విష‌యంపై ఓ క్లారిటీకి వ‌చ్చిన జ‌గ‌న్ ఇక కొత్త కేబినెట్ ప్ర‌మాణ స్వీకారానికి సంబంధించి ముహూర్తాన్ని కూడా ఖ‌రారు చేయించారు.
AP Cabinet
AP Assembly
YSRCP
YS Jagan

More Telugu News