Pawan Kalyan: పవన్ తో 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత భేటీ.. పక్కనే హరీశ్ శంకర్!

The Kashmir Files movie producer Abhishek Agarwal meets Pawan Kalyan
  • పవన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అభిషేక్ అగర్వాల్
  • పవన్ ను కలవడం సంతోషంగా ఉందన్న అగర్వాల్
  • వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందా? అనే కోణంలో ప్రారంభమైన చర్చ
ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'ది కశ్మీర్ ఫైల్స్' సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. 1990లో జమ్మూకశ్మీర్ లో కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిన ఘటనలతో ఈ చిత్రాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు. 

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఈ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిశారు. అయితే ఈ కలయిక వెనుక కారణం ఏమిటన్నది మాత్రం వెలుగులోకి రాలేదు. పవన్ తో అభిషేక్ చిత్రాన్ని నిర్మిస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ కూడా వీరితో ఉండటం గమనార్హం.  

పవన్ తో సమావేశానంతరం అభిషేక్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పవన్ తో సుదీర్ఘమైన సంభాషణ జరగడం ఆనందంగా ఉందని చెప్పారు.
Pawan Kalyan
Janasena
Abhishek Agarwal
The Kashmir Files
Harish Shankar
Tollywood
Bollywood

More Telugu News